యూఏఈలో ఈ ఏడాది హాటెస్ట్ డే....50.8°C దాటిన ఉష్ణోగ్రత

- August 27, 2023 , by Maagulf
యూఏఈలో ఈ ఏడాది హాటెస్ట్ డే....50.8°C దాటిన ఉష్ణోగ్రత

యూఏఈ: సంవత్సరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజుగా శనివారం నమోదైంది. ఉష్ణోగ్రతలు 50.8°C దాటింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ ప్రకారం.. అబుధాబిలోని ఓవైద్ (అల్ దఫ్రా ప్రాంతం)లో మధ్యాహ్నం 2:45 గంటలకు అత్యధిక ఉష్ణోగ్రత(50.8°C) నమోదైంది.  అంతకుముందు జూలైలో అబుధాబిలోని బడా దఫాస్ (అల్ దఫ్రా ప్రాంతం)లో జూలై 15, 16 తేదీల్లో వరుసగా రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 50.1°Cని తాకడంతో ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు మొదటిసారిగా 50ºC-మార్కును దాటింది. ఈ నెల ప్రారంభంలో ఆగస్టు 2న ఔటైడ్ (అల్ దఫ్రా ప్రాంతం)లో ఉష్ణోగ్రతలు 50.2°Cకి చేరుకున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 25న ఉష్ణోగ్రతలు 50.3°Cకి చేరుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com