సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రవాస తెలుగు ఫ్యామిలీ దుర్మరణం

- August 27, 2023 , by Maagulf
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రవాస తెలుగు ఫ్యామిలీ దుర్మరణం

రియాద్: సౌదీ అరేబియాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు దుర్మరణం చెందారు. రియాద్ పోలసులు తెలిపిన వివరాల ప్రకారం.. కువైత్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో పని చేస్తున్న దండు గౌస్ బాషా తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్ (02), దామీల్ (8 నెలలు) తో కలిసి 10 రోజుల క్రితం సౌదీ వచ్చారు.

మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకొని తిరిగి కువైత్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. హఫ్నా రోడ్డుపై వీరు ప్రయాణిస్తున్న కారును ఒక ట్రాలీ ఢీకొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగి మొత్తం కుటుంబం అగ్నికి అహుతి అయింది. మృతదేహాలను రియాద్ సమీపంలోని రూమా ఆసుపత్రికి తరలించారు. మృతుడు గౌస్ అన్నమయ్య జిల్లా కడకడ మండల కేంద్రానికి చెందిన వారని ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్దిఖ్ తువూరు తెలిపారు. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు ఇద్దరూ ఒక్కసారి కుప్పకూలడంతో స్వస్ధలంలో ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. అల్ రుమాలో వీరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సద్దిఖ్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com