కొత్త విద్యా సంవత్సరానికి సిద్ధమైన ఒమన్ స్కూల్స్
- August 28, 2023
మస్కట్: కొత్త విద్యా సంవత్సరం “2023/2024” కోసం పాఠశాలలకు తిరిగి రావడం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. నాన్ టీచింగ్ స్టాఫ్ సుల్తానేట్ పాఠశాలల్లో తమ పనిని ప్రారంభించారు. మంగళవారం విద్యార్థులను స్వాగతించేందుకు పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సూపర్విజన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సులైమాన్ బిన్ అబ్దుల్లా అల్-జముదీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు నూతన ఉత్సాహంతో సిద్ధమయ్యారని, ఉపాధ్యాయులకు వృత్తి శిక్షణ కోసం ప్రత్యేక సంస్థ 2023/2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన శిక్షణ ప్రణాళికలో అమలు చేస్తోందని తెలిపారు. ఒమన్ విజన్ 2040కి అనుగుణంగా విద్యా ప్రక్రియలో నైపుణ్యం లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసిన ప్రణాళికల ప్రకారం గవర్నరేట్ పాఠశాలలు పునర్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఒక్కో పాఠశాలకు మంజూరైన కోటా ప్రకారం పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తయిందన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







