కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం. ఇద్దరు మృతి
- August 28, 2023
కువైట్: గల్ఫ్ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. కువైట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు మరణించిగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున 3.17 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఫాతిమా అల్ మోమెన్ గా గుర్తించారు. ఆమెకు సోషల్ మీడియా ఫాలోయింగ్ గణనీయంగా ఉంది. ఆమె డ్రగ్స్ మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఆమె కోలుకున్నాక అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెపై హత్య, మద్యం మత్తులో డ్రైవింగ్ , నిర్దేశించిన వేగ పరిమితిని మించడం, సిగ్నల్ జంప్, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, గడువు ముగిసిన బీమాతో వాహనం నడపడం, ఇతరుల ఆస్తులకు నష్టం కలిగించడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అభియోగాలను మోపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







