బెస్ట్ సెక్యూరిటీ ఇన్స్పెక్షన్ అవార్డు గెలుచుకున్న బహ్రెయిన్
- August 28, 2023
బహ్రెయిన్: 2023 రెండవ త్రైమాసికానికి ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) జారీ చేసిన నివేదికల ఆధారంగా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ డైరెక్టరేట్ మిడిల్ ఈస్ట్‌లోని విమానాశ్రయాలలో భద్రతలో అత్యుత్తమ విధానాలకు అవార్డును గెలుచుకుంది. బహ్రెయిన్ అంతర్గత మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, లెఫ్టినెంట్ జనరల్ తారిఖ్ అనుసరించిన అభివృద్ధి మరియు ఆధునీకరణ వ్యూహం ఫలితంగా ఈ అవార్డు లభించిందని పోర్ట్స్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ అహ్మద్ జాసిమ్ అల్ హితైమి తెలిపారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ డైరెక్టరేట్‌లోని ఉద్యోగులందరి కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు.బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ దుయాజ్ అల్ కువారి మాట్లాడుతూ..ఎయిర్పోర్ట్ పోలీస్ డైరెక్టరేట్ నిరంతర కృషి, అంతర్గత తనిఖీల వల్ల ఈ అవార్డు లభించిందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







