విద్యాదీవెన పిల్లల భవిష్యత్తును మారుతుంది: సిఎం జగన్
- August 28, 2023
అమరావతి: సిఎం జగన్ చిత్తూరు జిల్లా నగరిలో జగనన్న విద్యాదీవెన పథకాన్ని మరోసారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం ఇది అన్నారు. తల్లిదండ్రుల పేదరికం.. పిల్లల చదువుకి అడ్డం కాకూడదు అనే ఉద్దేశంతోనే జగనన్న విద్యా దీవెనను తెచ్చినట్లు ఆయన తెలిపారు. 100 శాతం పూర్తి ఫీజును ప్రతీ 3 నెలలకు ఓసారి.. రీయింబర్స్ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఫీజును ఈరోజు రిలీజ్ చేసినట్లు వివరించారు. బటన్ నొక్కడం ద్వారా నేరుగా తల్లుల అకౌంట్లలోకి మనీ పంపిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.11,317 కోట్లను లబ్దిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు.
చంద్రబాబు , తన కొడుకు మీద నమ్మకం లేకే, దత్తపుత్రుణ్ని తెచ్చుకున్నారన్న సీఎం జగన్, శవ రాజకీయాలకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేసిందేమీ లేకపోవడం వల్లే చంద్రబాబు, దత్తపుత్రుడూ.. కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పుంగనూరులో 47 మంది పోలీసులపై కర్రలు, బీర్ బాటిళ్లతో దాడి చేశారన్న జగన్.. ఇది చాలా బాధ అనిపిస్తోందని అన్నారు.
కాగా, ఏప్రిల్ నుంచి జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చుతున్నారు. వారి ఫీజును పూర్తిగా రీయింబర్స్‌మెంట్ చేస్తున్నారు. ఇందుకోసం బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ మనీని.. ఫీజు-రీయింబర్స్‌మెంట్ కింద విద్యాసంస్థలు తీసుకుంటాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







