గణేష్ ఉత్సవాల పై MCHRDలో ఉన్నత స్థాయి సమీక్ష
- August 28, 2023
హైదరాబాద్: హైదరాబాద్ గణేష్ ఉత్సవాలపై MCHRDలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
సెప్టెంబర్ 19న వినాయక చవితి, 28న ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ఉంటుందని భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం, అధికారులు చెప్పారని వెల్లడించారు. గణేష్ పూజా విధానం తెలిపే బుక్ తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలని పేర్కొన్నారు. వినాయక మండపాలకు పోలీస్ పర్మీషన్ తప్పనిసరి కాదని, స్థానిక పోలీస్ స్టేషన్లో చెప్పితే సరిపోతుందని తెలిపారు.
రాజకీయ నాయకులు గణేష్ ఉత్సవాల్లో ఫ్లెక్సీలో పెడుతున్నారని, సుప్రీంకోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించిందన్నారు. ఈ సారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టొద్దని మంత్రికి చెప్పామని తెలిపారు. సెప్లెంబర్ 19న వినాయక చవితిగా నిర్ణయించామని పేర్కొన్నారు. సూర్యోదయం ఆధారంగా వినాయక చవితిని 19న నిర్ణయించామని, 28న వినాయక నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేశారు. వినాయక చవితి పండుగ ఏ తేదీ అని చాలా మందిలో సందేహం ఉందన్నారు.
సెప్టెంబర్ 19వ తేదీనే సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి పండుగ, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 18న మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుందని తెలిపారు. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండగ రోజుగా గుర్తిస్తాం.. కాబట్టి 19వ తేదీన వినాయక చవితి జరుపుతున్నామని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాలకు ముఖ్యమంత్రిని రావాలని చెప్పామని తెలిపారు.
గణేష్ ఉత్సవ ఏర్పాట్ల పై సమావేశం ముగిసిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. దేశంలో హైదరాబాద్ లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 30 వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారు అవుతాయని పేర్కొన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక్ పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున గడిచిన 9 ఏళ్ల పాటు అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమం శోభాయామానంగా జరుగుతుందన్నారు. వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఓకే రోజు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. బడ్జెట్ తో సంబందం లేకుండా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించిందన్నారు. మండపాల పర్మిషన్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







