ఆదిత్య ఎల్-1 ప్రయోగ తేదీని ప్రకటించిన ఇస్రో
- August 28, 2023
బెంగళూరు: ‘చంద్రయాన్–3’ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. సూర్యుడిపై ప్రయోగానికి సిద్ధమైంది. ‘ఆదిత్య ఎల్–1’ ప్రయోగ తేదీని ఈ మేరకు ప్రకటించింది. సెప్టెంబర్ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇస్రో ట్వీట్ చేసింది. ‘‘సూర్యుడిపై అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత తొలి భారతీయ అబ్జర్వేటరీ ఆదిత్య ఎల్–1 ప్రయోనికి సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి సెప్టెంబర్ 2న 11.50కి పీఎస్ఎల్వీ–సీ57 ప్రయోగం చేపట్టనున్నాం” అని తెలిపింది.
శ్రీహరికోట నుంచి జరిగే ప్రయోగాన్ని లాంచింగ్ వ్యూ గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ప్రజలను ఆహ్వానించింది. ఇందుకోసం వెబ్సైట్ (https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. రేపటి (ఆగస్టు 29) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







