రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు నాయుడు
- August 28, 2023
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ చిత్రంతో కూడిన ఈ రూ.100 నాణెం ఆవిష్కరణకు టిడిపి అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు ‘ఎక్స్’ లో స్పందించారు. “ఎన్టీఆర్ గౌరవార్థం ఆయన బొమ్మతో కూడిన ప్రత్యేక నాణేన్ని విడుదల చేసినందుకు గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి హృదయకపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, రాజకీయాలకు అతీతంగా, హద్దులను చెరిపివేస్తూ, ఎన్టీఆర్ ఘనతర వారసత్వాన్ని స్మరించుకుంటూ, నేడు ఐక్యంగా నిలిచిన ప్రపంచవ్యాప్త తెలుగు ప్రజలందరికీ ఈ ఘట్టం ఎనలేని గర్వకారణం” అని చంద్రబాబు వివరించారు.
తాజా వార్తలు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!







