యూఏఈ ఎయిర్‌లైన్ హాలిడే సేల్‌. Dh895 నుండి విమాన ఛార్జీలు ప్రారంభం

- August 30, 2023 , by Maagulf
యూఏఈ ఎయిర్‌లైన్ హాలిడే సేల్‌. Dh895 నుండి విమాన ఛార్జీలు ప్రారంభం

యూఏఈ: అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ ఎయిర్‌లైన్ హాలిడే సేల్‌ ప్రకటించింది. నెట్‌వర్క్‌లో “వివిధ గమ్యస్థానాలకు తగ్గింపు ధరలతో” విక్రయాన్ని ప్రకటించింది. సెప్టెంబరు 10 వరకు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు సెప్టెంబర్ 11-21 మధ్య ప్రయాణానికి తగ్గిన విమాన ఛార్జీలను పొందవచ్చు.అబుదాబి నుండి ఎకానమీ క్లాస్‌లో తగ్గింపు ధరలు అమ్మన్‌కి Dh895 నుండి ప్రారంభమవుతాయి. ఇస్తాంబుల్‌కి Dh925; మనీలాకు Dh2,195; కాసాబ్లాంకాకు Dh2,495; లండన్‌కు Dh2,895 మరియు ఆమ్‌స్టర్‌డామ్‌కి Dh2,995 చార్జీలను ప్రకటించారు.బిజినెస్ క్లాస్ ఛార్జీలు కైరోకి Dh6,395 నుండి ప్రారంభమవుతాయి.బ్యాంకాక్‌కి Dh12,295; జూరిచ్‌కి Dh14,495; జెనీవాకు Dh16,995; చికాగోకు Dh21,495 మరియు సిడ్నీకి Dh24,995 అని ఎతిహాద్ ఎయిర్‌వేస్ చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ అరిక్ దే తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com