సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తున్న తెలుగు యువకుడు
- August 31, 2023
సింగపూర్: కళ్లెదుటే కరోనాతో తన తండ్రి,ఇంకా ఎంతో మంది చనిపోవడం తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గిర్మాజీపేటకు చెందిన రంజిత్ ని కదిలించింది. కాలుష్యం మానవ రోగ నిరోధక శక్తిని బలహీనపరిచి, ప్రజల్ని సులువుగా కరోనా,ఇతర అనారోగాల బారిన పడేటట్లు చేస్తుందని తెలుసుకున్నాడు. అందుకే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా,శారీరక దృఢత్వం కలిగి ఉండాలన్న ఆలోచనని కలిగించాలని-Solution to Polution (కాలుష్యానికి పరిష్కారం) అనే లక్ష్యంతో యాత్ర ప్రారంభించాడు. దానికై కాలుష్యం కలిగించని,శారీరక వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని అందించే సైక్లింగ్ చెయ్యాలని ధృడ సంకల్పతో అడుగులు వేసాడు రంజిత్. 2021 ఏప్రిల్ 5న మొదలైన 'రంజిత్ ఆన్ వీల్స్ సైక్లింగ్ భారతదేశం దాటి ఇప్పుడు ఆసియా ఖండంలోని వియత్నాం, కంబోడియా,థాయిలాండ్,మలేషియా దేశాలను చుట్టి ది 29-ఆగష్టు-2023 న సింగపూర్ చేరుకున్నాడు.
మంచి సంకల్పంతో రంజిత్ చేస్తున్న ఈ యాత్రకి సింగపూర్ తెలుగు సమాజం ఆతిథ్యము ఇచ్చింది. రంజిత్ చేస్తున్న కృషిని కమిటీ అభినందించింది.
ఈ సందర్భంగా తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ,ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటని,దీనివల్ల మానవాళి రోగనిరోధక సన్నగిల్లితుందని, మనమంతా కనీసం వారంలో ఒక్కరోజైనా సైక్లింగ్ చెయ్యాలని,దీనివల్ల పర్యావరణం మెరుగుపడటంతో పాటు మనమంతా శారీరకంగా దృఢంగా ఉంటామని తెలిపారు. అందరూ రంజిత్ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నామని తెలిపారు. తరవాత కమిటీ సభ్యులు రంజిత్ ను సత్కరించారు. తన ప్రపంచ యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
రంజిత్ మాట్లాడుతూ, సింగపూర్ దేశం చాల బాగుందని ఇక్కడ పచ్చని చెట్లు అధికంగా ఉండటం,ప్రజలందరూ మెట్రో రైలు, సిటీ బస్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం,చాలాచోట్ల సైకిల్ వాడటం గమనించానని, కాలుష్యానికి అవకాశం తక్కువఉందని తెలిపారు. తెలుగు సమాజం వారిచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు.
రంజిత్ రెండు రోజులలో సింగపూర్ నుండి ఇండోనేసియా లోని జకార్తాకు, తరువాత ఫిలిప్పైన్స్ మరియు ఇతర దేశాల గుండా ఆస్ట్రేలియా చేరుకొని సైక్లింగ్ పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. 2021 ఏప్రిల్ 5 నుండి ఇప్పటివరకు 22,300 కిలోమీటర్ల ప్రయాణం చేసాడు. ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా, యూరప్ ఖండాల్లో సైక్లింగ్ చేసే దిశగా ముందుకు వెళుతున్నానని వెల్లడించాడు.
రంజిత్ ఆన్ వీల్స్ ఫేస్బుక్ పేజీ మరియు ఇంస్టాగ్రామ్ ద్వారా దాదాపు 3 లక్షల 60 వేలమంది ఫాలోవర్స్ వున్న రంజిత్ నిత్యం వారికి తన ప్రయాణంలో విశేషాల్ని పంచుకుంటున్నాడు.
ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు అన్నారు- కాలుష్యం తమ తమ పరిధిలో నియంత్రిస్తూ, తగిన శారిరక శ్రమ చేయడం ద్వారా తప్పకుండా తనకోరిక నెరవేరుతుంది.


తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







