ఈజిప్టు ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం అదృశ్యం..
- May 18, 2016
ఈజిప్టు ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం అదృశ్యమవడం కలకలం సృష్టించింది. రాడార్ నుంచి సంకేతాలు రాకపోవడంతో ఈ విషయం బయటపడింది. ఈజిప్టు ఏయిర్ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేసింది. ఫాన్స్ రాజధాని పారిస్ నుంచి ఈజిప్టులోని కైరో పట్టణానికి బుధవారం రాత్రి దాదాపు 11 గంటల ప్రాంతంలో బయలుదేరింది. గురువారం ఉదయం 3 గంటలకు కైరోకు చేరుకోవాలి. కానీ విమానం గురించి ఎలాంటి సమాచారం లేదని, విమానం గమ్యస్థానం చేరలేదని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.
59 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బదితో పారిస్ లో నిన్న రాత్రి బయలుదేరిన విమానం ఇప్పటివరకూ గమ్యస్థానాన్ని చేరుకోలేదని సమాచారం అందింది. దాదాపు 2:45 గంటలకు రాడార్ సంకేతాలు అందాయని, మరో 15 నిమిషాల్లో విమాన్యం ల్యాండ్ అవుతుందనగా చివరిసారిగా రాడార్ సిగ్నల్స్ తమకు అందినట్లు ఈజిప్టు ఎయిర్ లైన్స్ వెల్లడించింది. గమ్యస్థానం కేవలం 80 మైళ్ల దూరంలో ఉండగా విమానం సమాచారం నిలిచిపోయింది. ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







