బర్వా సిటీలో లులు డిపార్ట్‌మెంట్ స్టోర్
- May 19, 2016
బక్రా సిటీ, అబు హామర్, మెసైమీర్, వకైర్, అల్ వక్రా మరియు ఇండస్ట్రియల్ ఏరియా నివాసితులకు లులు హైపర్ మార్కెట్ లోని డిపార్ట్‌మెంట్ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. 80,000 చదరపు అడుగులతో ఈ స్టోర్‌ని లులు గ్రూప్ ప్రారంభించింది. గార్మెంట్స్, ఫుట్‌వేర్, హౌస్‌హోల్డ్ ప్రోడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్స్ ఇక్కడ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. లులు ఫ్యాషన్ స్టోర్స్, లులు కనెక్ట్ మరియు లులు సెలబ్రేట్ అనే మూడు ప్రత్యేక జోన్లుగా స్టోర్‌ని తీర్చిదిద్దారు. 10,000 చదరపు అడుగులతో చిల్డ్రన్స్ ఎమ్యూజ్‌మెంట్ ఏరియాని ఏర్పాటు చేశారు. ఇందులో పార్టీ జోన్, బంపర్ కార్స్, వరల్డ్ ట్రిప్, మినీ టాప్ స్పిన్, వీడియో గేమ్స్, రిడింప్షన్ గేమ్స్, నోవెల్టీ, కిడ్డీ రైడ్స్ వంటి ఆకర్షణలున్నాయి. లులు - దోహా బ్యాంక్ కార్డు ఉన్నవారికి ఖతార్‌లోని లులు షాపింగ్ డెస్టినేషన్స్‌లో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందించిన డిపార్ట్‌మెంట్ స్టోర్ అనీ, ఖతార్‌లో తొలిసారిగా ఈ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేశామనీ, సెంట్రల్ దోహా, వుకైర్, అల్ హిలాల్ నుంచి కర్వా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మరియు టాక్సీ సర్వీసుల ద్వారా ఈ స్టోర్ అందరికీ అందుబాటులో ఉంటుందని లులు గ్రూప్ డైరెక్టర్ మొహమ్మద్ అల్తాఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







