ఐకానిక్ దుబాయ్ క్లాక్ టవర్ ప్రారంభం
- September 01, 2023
దుబాయ్: ఐకానిక్ డెయిరా క్లాక్ టవర్ అద్భుతమైన కొత్త మేక్ఓవర్ తర్వాత ప్రారంభమైంది. 1960లలో ప్రారంభమైనప్పటి నుండి దుబాయ్ చిహ్నంగా ఉన్న క్లాక్ టవర్ ఆధునికతతో కలసి నగర చరిత్రను తెలిపేలా కొత్త రూపాన్ని సంతరించుకుంది. దుబాయ్ మునిసిపాలిటీ ప్రాజెక్ట్‌ను Dh10 మిలియన్ల వ్యయంతో పూర్తి చేసింది. ఇది దుబాయ్ పట్టణ ప్రకృతి దృశ్యాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోనుంది. మే 2023లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సాలిడ్ ఫ్లోరింగ్ ఉద్యానవనంతో తీర్చిదిద్దారు. రౌండ్అబౌట్ ప్రధాన భాగం అద్భుతమైన నీటి ఫౌంటెన్ తో సమకాలీన డిజైన్‌ను కలిగి ఉందని DM డైరెక్టర్ జనరల్ దావూద్ అల్ హజ్రీ వెల్లడించారు. దుబాయ్‌లోని అత్యంత ప్రముఖ ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చరల్ మైలురాళ్లలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







