ఆసియా కప్ 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్‌లో ఎక్కడ చూడొచ్చంటే..!
- September 02, 2023
దుబాయ్: ఈ సంవత్సరం అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్‌లలో ఒకటై ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం యూఏఈలోని నివాసితులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2న జరిగే లీగ్‌లో క్రికెట్ చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌లు తొలిసారి తలపడనున్నాయి.
టాస్: 1pm, యూఏఈ సమయం
మ్యాచ్ ప్రారంభం: యూఏఈ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30గం
ఎక్కడ చూడొచ్చంటే..
దుబాయ్ చుట్టూ ఉన్న కొన్ని ప్రదేశాలలో ప్రత్యేకంగా మ్యాచ్ ను స్ట్రీమింగ్ వేస్తున్నారు. అయితే, మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు సీట్లను బుక్ చేసుకోవడం మర్చిపోకండి.
1. TJ
ఆసియా కప్ కోసం క్రికెట్ ఔత్సాహికులు తాజ్ జుమేరా లేక్స్ టవర్స్‌లోని TJలకు వెళ్లవచ్చు. జనాదరణ పొందిన ఈ ప్రదేశంలో మ్యాచ్‌ను తిలకించవచ్చు. అన్ని పానీయాలపై 50 శాతం తగ్గింపు ప్రకటించారు.
2. ఫ్లయింగ్ క్యాచ్
ఏస్ క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రారంభించిన స్పోర్ట్స్ రెస్టారెంట్‌లో ఆరు LED స్క్రీన్‌లు, భారీ 200cm జెయింట్ స్క్రీన్ ఉన్నాయి. జుమేరా 1లో ఉన్న ఫ్లయింగ్ క్యాచ్ అపరిమిత వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్‌లను రెండు రిఫ్రెష్ మాక్‌టెయిల్‌లతో మూడు గంటల పాటు Dh149కి అందిస్తుంది.
3. హడిల్
దుబాయ్‌లోని ప్రముఖ స్పోర్ట్స్ బార్. హడిల్ క్రికెట్ అభిమానులు ఆటను చూస్తున్నప్పుడు వారికి అనేక రుచికరమైన ఆఫర్‌లను అందిస్తోంది. మీరు 050 100 7065కు కాల్ చేయడం ద్వారా ముందుగానే స్థలాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు.
4. ఎస్టర్ డే
బుర్ దుబాయ్‌లోని ఈ హాయిగా ఉండే రెస్టారెంట్ స్పోర్ట్స్ లాంజ్. 80-90ల నాటి వైబ్‌లతో గేమ్‌ను ప్రత్యక్షంగా ఆస్వాదించంవచ్చు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సెప్టెంబర్ 2న బిగ్ గేమ్‌ను కూడా ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







