టాస్ గెలిచిన టీమిండియా..
- September 02, 2023
ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ వేయగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్సే పడింది. దీంతో టాస్ గెలిచిన రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. అలాగే ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నట్టు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు. అలాగే తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నాడు. నేపాల్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. ఈ పిచ్‌పై 2020 నుంచి 9 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలిచింది. కాగా ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ ఇప్పటివరకు 13సార్లు (వన్డే ఫార్మాల్లో) తలపడ్డాయి. భారత్ 7, పాక్ 5 మ్యాచుల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
జట్ల వివరాలు...
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్‌లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్‌పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







