225% పెరిగిన సౌదీ అరేబియా పర్యాటక మిగులు
- September 02, 2023
రియాద్: పర్యాటక మిగులు Q1 2023లో SR22.8 బిలియన్లకు పెరిగిందని సౌదీ అరేబియా టూరిజం మంత్రిత్వ శాఖ 2023 మొదటి త్రైమాసికం గణాంకాలను వెల్లడించింది. గతసంవత్సరం మొదటి త్రైమాసికంలో SR1.6 బిలియన్లుగా ఉంది. సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) డేటా ప్రకారం.. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 225% పెరుగుదల నమోదైంది. అదే విధంగా SR37 బిలియన్లకు ఇన్కమింగ్ టూరిజం ఆదాయాలు చేరుకున్నాయి. కింగ్డమ్ యొక్క పర్యాటక రంగం వృద్ధిని పెంపొందించడానికి వివిధ ప్రభుత్వ సంస్థలతో నిరంతర సహకారాన్ని పెంపొందించడం ద్వారా సౌదీ అరేబియాను అగ్ర అంతర్జాతీయ గమ్యస్థానాలలో నిలిపాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా పర్యాటక పరిశ్రమలో చెప్పుకోదగ్గ మైలురాళ్లను సాధించింది. అంతర్జాతీయ పర్యాటక ఆదాయ సూచికలో దేశం ఆకట్టుకునే 16 స్థానాలను అధిరోహించింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో నిలిచింది. 2019లో 27వ స్థానంలో నిలిచింది. దీంతోపాటు సౌదీ అరేబియా మొదటి త్రైమాసికంలో అంతర్జాతీయంగా సుమారుగా 7.8 మిలియన్ల మంది పర్యాటకులను స్వాగతించింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







