యూఏఈ అధ్యక్షుడితో సమావేశమైన కువైట్ ఉప ప్రధాని
- September 02, 2023
అబుధాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను శుక్రవారం కువైట్ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి షేక్ అహ్మద్ ఫహద్ అల్-అహ్మద్ అల్-సబా కలుసుకున్నారు. కస్ర్ అల్-షాతిలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య లోతైన సోదర సంబంధాలపై చర్చించారు. కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా యొక్క శుభాకాంక్షలను షేక్ అహ్మద్ యూఏఈ నాయకుడికి తెలిజయజేశారు. ఇరు దేశాలు, వారి ప్రజల పురోగతి, శ్రేయస్సు కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను పంచుకున్నాయి. అంతకుముందు అబుధాబి అధ్యక్ష విమానాశ్రయానికి చేరుకున్న షేక్ అహ్మద్‌కు అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘనంగా స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







