మ్యాచ్ రద్దు.. భారత్, పాకిస్తాన్‌కు చెరో పాయింట్
- September 03, 2023
పల్లెకలె: క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత తన ప్రతాపాన్ని చూపించాడు. ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్‌ను ఇచ్చారు.
అంతక ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(10), విరాట్ కోహ్లి(4)లతో పాటు నాలుగో స్థానంలో బరిలోకి దిగి జట్టును ఆదుకుంటాడు అని భావించిన శ్రేయస్ అయ్యర్ (14) లు విఫలం కావడంతో టీమ్ఇండియా 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (82; 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (87; 90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) జట్టును ఆదుకున్నారు.
మొదట క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించిన వీరు క్రమంగా జోరు పెంచారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ 54 బంతుల్లో హర్దిక్ 62 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్థశతకం తరువాత ఇషాన్ కిషన్ మరింత వేగంగా ఆడాడు. అయితే.. సెంచరీ దిశగా సాగుతున్న కిషన్‌ను హారిస్ రవూఫ్ ఔట్ చేసి 138 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తరువాత జడేజా (14) అండతో హర్దిక్ వేగంగా ఆడాడు. అయితే ఒకే ఓవర్‌లో షాహిన్ అఫ్రిది.. హర్దిక్‌తో పాటు జడేజాలను ఔట్ చేసి భారత్‌ను గట్టి దెబ్బకొట్టాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే శార్దూల్ ఠాకూర్(3) సైతం ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అప్రీది నాలుగు వికెట్లు తీయగా, నదీమ్ షా, హారిస్ రవూఫ్ లు చెరో మూడు వికెట్లు తీశారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







