FNC ఎన్నికలు: అభ్యర్థుల తుది జాబితాకు ఆమోదం
- September 02, 2023
యూఏఈ: ఈ ఏడాది యూఏఈ ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ (FNC) ఎన్నికలకు అభ్యర్థుల తుది జాబితాను జాతీయ ఎన్నికల కమిటీ (NEC) శనివారం ఆమోదించింది. FNC సభ్యత్వం కోసం మొత్తం 309 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.ఇందులో అబుధాబిలో 118 మంది, దుబాయ్‌లో 57, షార్జాలో 50, అజ్మాన్‌లో 21, రస్ అల్ ఖైమాలో 34, ఉమ్ అల్ క్వైన్‌లో 14, ఫుజైరాలో 15 మంది చొప్పున జాబితాలో ఉన్నారు. ఆగస్ట్ 26 నుండి 28 వరకు కొనసాగిన అప్పీళ్ల వ్యవధి తర్వాత తుది జాబితాను విడుదల చేశారు.
ఈ సంవత్సరం FNC అభ్యర్థులలో 59% పురుషులు, 41% మహిళలు ఉన్నారు. 36 మంది అభ్యర్థులు 25 మరియు 35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు ఉండగా.. 273 మంది అభ్యర్థులు 36 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. వీరి నుంచి 20 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. అబుధాబి మరియు దుబాయ్‌లకు చెరో నాలుగు సీట్లు, షార్జా- రస్ అల్ ఖైమాలకు మూడు సీట్లు, అజ్మాన్, ఉమ్ అల్ క్వైన్, ఫుజైరాలకు రెండు సీట్లు కేటాయించబడ్డాయి. ఎఫ్‌ఎన్‌సి వ్యవహారాల సహాయ మంత్రి మరియు ఎన్ఇసి చైర్మన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ మహ్మద్ అల్ ఒవైస్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎన్నికలను విజయవంతం చేసేందుకు కమిటీ అన్ని విధాలా కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 11న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి 23 రోజుల పాటు నిర్వహించనున్నారు. అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 26 చివరి రోజుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







