‘సలార్’ పోస్ట్‌పోన్ అయ్యిందా.?

- September 04, 2023 , by Maagulf
‘సలార్’ పోస్ట్‌పోన్ అయ్యిందా.?

‘ఆది పురుష్’ సినిమాతో మరో ఎదురు దెబ్బ తగిలింది ప్రబాస్‌కి. ‘సలార్’తో ఆ దెబ్బను మటుమాయం చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. సెప్టెంబర్‌లో ‘సలార్’ రిలీజ్ అవుతుందని మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
అయితే, అనుకున్న టైమ్‌కి ‘సలార్’ రిలీజ్ కావడం లేదని ఇన్‌సైడ్ టాక్. ఈ సినిమాకి సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ వుందట. సీజీ వర్క్ కంప్లీట్ కాలేదట. రీషూట్ ప్రచారాలు కూడా వినిపిస్తున్నాయ్.
ఈ నేపథ్యంలోనే ‘సలార్’ని నవంబర్‌కి పోస్ట్‌పోన్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాదు కాదు, జనవరికెళ్లిపోతుంది అని కూడా అంటున్నారు. ‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రబాస్.. ఆ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమాలన్నింటితోనూ పెద్ద తలనొప్పే భరించాల్సి వస్తోంది.
‘బాహుబలి’ సినిమా తర్వాత ఏ ఒక్క సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోతోంది. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్న చందంగా తయారవుతున్నాయ్ ప్రబాస్ సినిమాలు.
ప్రశాంత్ నీల్‌ని దృష్టిలో పెట్టుకుని ‘సలార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయ్. కానీ, ‘సలార్’కీ ప్రబాస్ సినిమా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. అన్నట్లు ‘సలార్’లో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com