ఫిలిప్పీన్స్ జాతీయుడి హత్య కేసు...ఆస్పత్రిలో ప్రవాస భారతీయుడు మృతి
- September 05, 2023
కువైట్: ఆదివారం ఉదయం ఫిలిప్పీన్స్ జాతీయుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవాస భారతీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు కువైట్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఒమారియా ప్రాంతంలోని తన గదిలో ఫిలిప్పీన్స్ స్నేహితుడిని చంపిన తర్వాత భారతీయ స్నేహితుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫిలిప్పీన్స్ జాతీయుడిని హత్య చేసినట్లు అతనిపై అభియోగాలను భద్రతా అధికారులు నమోదు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







