గ్లోబల్ వాటర్ ఆర్గనైజేషన్ ఏర్పాటును ప్రకటించిన క్రౌన్ ప్రిన్స్
- September 05, 2023
జెడ్డా: ప్రపంచవ్యాప్తంగా నీటివనరులను సంరక్షిడంలో ప్రభుత్వాలు, సంస్థలు చేపడుతున్న ప్రయత్నాలను ఏకీకృతం చేయడానికి, మెరుగుపరచడానికి సౌదీ అరేబియా గ్లోబల్ వాటర్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ సోమవారం ప్రకటించారు. రియాద్‌లో ప్రధాన కార్యాలయంలో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థ నైపుణ్యం, అధునాతన సాంకేతికత, ఆవిష్కరణలను ప్రోత్సహించడం మరియు పరిశోధన, అభివృద్ధి అనుభవాలను ప్రపంచదేశాలు, సంస్థలతో పంచుకోనుంది. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.8 బిలియన్లకు చేరుతుందని, నాటికి ప్రపంచ నీటి డిమాండ్ రెట్టింపు అవుతుందన్న అంచనాలతో ఇటువంటి సహకారం అత్యవసరమైనదని ఈ సందర్భంగా క్రౌన్ ప్రిన్స్ వెల్లడించారు. ఈ చొరవ అన్ని సభ్య దేశాలతో, నీటి భద్రత-సంబంధిత స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దోహదపడుతుందన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







