‘హరి హరవీరమల్లు’ అలా డిసైడ్ అయ్యారా.?
- September 05, 2023
‘హరి హరవీరమల్లు’ సినిమా స్టార్ట్ చేసి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కానీ, సినిమా ఇంతవరకూ ఓ కొలిక్కి రాలేదు. ఈ సినిమా కన్నా లేట్‌గా స్టార్ట్ చేసిన ‘బ్రో’, ‘ఓజీ’ సినిమాలు షూట్ పూర్తి చేసుకున్నాయ్.
‘బ్రో’ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కూడా. ఈ నేపథ్యంలోనే ‘హరి హరవీరమల్లు’ నిర్మాత ఏ.ఎమ్,రత్నం ఓ నిర్ణయానికి వచ్చారట.
ఇంతవరకూ పూర్తయిన షూటింగ్‌తోనే ‘హరి హరవీరమల్లు’ పార్ట్ 1 గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఆల్రెడీ ఆ పనులు స్టార్ట్ చేసేశారనీ తెలుస్తోంది. ఎలాగూ ఈ సినిమాని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే.
ఆ క్రమంలోనే ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ పార్ట్ అంతా కలిపి పార్ట్ 1గా రిలీజ్ చేసేందుకు టీమ్‌ని అలర్ట్ చేశారట ఏఎమ్ రత్నం. అలా చేసేందుకైనా పవన్ కళ్యాణ్ నుంచి ఇంకొన్ని డేట్స్ తీసుకోవాలట. ఎలాగోలా ఆ డేట్స్ తీసుకుని ఫస్ట్ పార్ట్ సినిమా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..