మొలకెత్తిన గింజలకు అంత శక్తి వుందా.?
- September 05, 2023
స్ప్రౌట్స్.. లేదా మొలకెత్తిన గింజలతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ప్రతీ రోజూ ఓ గుప్పుడు మొలకెత్తిన గింజల్ని తింటే ఎంతో ఆరోగ్యంగా వుంటామని నిపుణులు చెబుతున్నారు.
మొలకెత్తిన గింజలు అంటే, పెసలు, మినుములు, శనగలు.. ఇలా ఏవైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా మొలకెత్తిన పెసలు ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయని అంటున్నారు.
దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. సో, మలబద్ధకం వంటి సమస్యలుంటే నయం అవుతాయ్. అలాగే, నులి పురుగుల సమస్య కూడా తగ్గుతుంది రెగ్యులర్‌గా మొలకెత్తిని పెసలు తినడం వల్ల.
అన్నింటికీ మించి తాజా అధ్యయనాల్లో వెల్లడైన విషయమేంటంటే, క్యాన్సర్ వ్యాధి రాకుండా వుండేందుకు మొలకెత్తిన పెసలు మంచి ఔషధంగా పని చేస్తున్నాయని సర్వేలో తేలింది.
అలాగే, మొలకెత్తిన గింజలు తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. తద్వారా షుగర్ వ్యాధి కంట్రోల్‌లో వుంటుంది. అధిక బరువు సమస్య వున్నవాళ్లు డైటింగ్ పేరు చెప్పి తిండి మానేయాల్సిన పని లేదు. దానికి బదులు ఓ చిన్న గిన్నెడు మొలకెత్తిన పెసలు తింటే కొవ్వు కరిగడంతో పాటూ, శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..