టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు..

- September 06, 2023 , by Maagulf
టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు..

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తికి ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాలక మండలి సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ప్రధానమైంది.. గోవిందకోటి రాస్తే వీఐపీ బ్రేక్ దర్శనం. చిన్నతనం నుంచే యువతలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు 25ఏళ్లలోపు యువత కోటి గోవింద నామాలు పూర్తిచేస్తే.. వారి కుటుంబానికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. యువతీ లేదా యువకుడు 10,01,116 సార్లు గోవింద నామాలు‌ రాస్తే ఆ వ్యక్తికి స్వామివారి బ్రేక్ దర్శనం కల్పించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంతేకాక, ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా 20 పేజీలున్న కోటి భగవద్గీత పుస్తకాలు శ్రీవారి ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com