దేశం పేరు మార్పు పై మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- September 06, 2023
న్యూఢిల్లీ: దేశం పేరును భారత్ గా మార్చడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రుల అభిప్రాయాలు, వ్యాఖ్యలు దీన్ని బలపరిచేలా ఉన్నాయి. ఈ నెల 9వ తేదీన జీ20 విందు నిర్వహిస్తుండగా.. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి భవన్ పంపించిన ఆహ్వాన లేఖల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండడం తెలిసిందే. దీనికితోడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహించడానికి కేంద్ర సర్కారు నిర్ణయించడం కూడా ఈ విధమైన సంకేతాలను ఇస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాను భారతీయుడినని, తన దేశం ఎప్పటికీ భారత్ గానే ఉంటుందనడం గమనార్హం. ఇప్పుడు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం దీనికి మద్దతుగా మాట్లాడారు.
‘‘ఇండియా అంటే భారత్. రాజ్యాంగంలో ఇదే ఉంది. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలని ఆహ్వానిస్తున్నాను. భారత్ అని చెప్పారంటే దానర్థం, అవగాహన అనేవి రాజ్యంగంలోనూ ప్రతిఫలిస్తాయి’’అని మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో మార్పులు తీసుకొస్తుండడం, వలస పాలన నాటి పేర్లను మారుస్తుండడం తెలిసిందే. ఇండియా పేరు కూడా బ్రిటిష్ పాలనా సమయం నుంచే వచ్చింది. అంతకుముందు వరకు భారత్, హిందుస్థాన్ అనే పేర్లు వాడుకలో ఉండేవి.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







