రోబో-డావిన్సీ రోబో మెషీన్‌ను ప్రారంభించిన చిన్నజీయర్ స్వామి
- September 06, 2023
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్ చైన్ మెడికవర్ హాస్పిటల్స్ బుధవారం నగరంలోని మొట్టమొదటి రోబోటిక్ ఇన్స్టిట్యూట్ లో అధునాతన రోబో-డావిన్సీ రోబో మెషీన్‌ను ప్రారంభించింది.శస్త్రచికిత్సా విధానాలను సమూలంగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ అధునాతన యంత్రాన్ని శ్రీ చిన జీయర్ స్వామీజీ ప్రారంభించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగిన మెడికవర్ హాస్పిటల్ వైద్య సదుపాయాలకు తాజా జోడింపు ఇది.అతి చిన్న కోత తో సర్జరీ విజయవంతంగా చేసే అవకాశం ఈ రోబో సహాయంతో సర్జన్లకు కలుగుతుంది.రోగులకు సైతం అద్భుతమైన ప్రయోజనాలను ఇది తీసుకువస్తుంది.డావిన్సీ రోబో సహాయంతో అతి సూక్ష్మ విభాగాలు మరియు ఖాళీలలో కూడా శస్త్రచికిత్సలను ఖచ్చితంగా నిర్వహించవచ్చు.
ఈ సందర్భంగా శ్రీ చినజీయర్ స్వామీజీ గారు మాట్లాడుతూ,మెడికవర్ హాస్పిటల్స్‌ను అభినందించారు. మెడికవర్ హాస్పిటల్స్ తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ , నాణ్యమైన ఆరోగ్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, వేగంగా విస్తరిస్తున్న తీరును కొనియాడారు.
మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ, “తక్కువ కోతతో క్లిష్టమైన శస్త్రచికిత్సల చికిత్సను సమర్థవంతంగా చేయడంలో మెడికవర్ హాస్పిటల్స్ సాధిస్తున్న పురోగతిలో ఇది మరో మైలురాయి. ఈ తాజా జోడింపు శస్త్రచికిత్స ప్రక్రియలలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుంది,కటి భాగం తో పాటుగా ( ఉరఃకుహరము) థొరాసిక్ క్యావిటీ వంటి చిన్న ప్రదేశాలకు, చిన్న కోతలతో చేరుకోవచ్చు. దీని వల్ల రోగి మరింత వేగంగా కోలుకోవచ్చు. సమీప భవిష్యత్తులో, మేము మరింత అధునాతన సాంకేతిక జోడింపులతో మా సామర్థ్యాలను పెంపొందించుకోవాలని ప్రణాళిక చేస్తున్నాము..." అని అన్నారు.
ఈ సందర్భంగా సర్జికల్ ఆంకాలజిస్ట్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో సరికొత్త యంత్రం తీసుకువచ్చే మార్పులను వివరించారు.“ అవసరమైన వారికి, మరీ ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు అత్యుత్తమ, అధునాతన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి డావిన్సీ రోబో మెషిన్ సహాయపడుతుంది. కృత్రిమ మేధస్సు, వణుకు లేని కదలిక మరియు యంత్రం యొక్క సామర్థ్యం కారణంగా సర్జన్లు ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా, రోగులు వేగంగా కోలుకోవడంతో పాటు అతి తక్కువ నొప్పి, తక్కువ రక్త నష్టం, తక్కువ ఇన్ఫెక్షన్ ప్రమాదం మరియు తక్కువ సమయం ఆసుపత్రిలో ఉండడం వంటి ప్రయోజనాలను పొందుతారు.." అని అన్నారు.
అనంతరం డాక్టర్ కృష్ణ కిరణ్ - డైరెక్టర్ - చీఫ్ ప్రైమరీ & రివిజన్ హిప్ & మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు గారు మాట్లాడుతూ సూక్షమైన మరియు క్లిష్టమైన సర్జరీస్ రోబోటిక్స్ ద్వారా గత నాలుగు సంవత్సరాలగా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ లో 2000 లకు పైగా విజయవంతమైన సర్జరీస్ నిర్వహించాం. ఇప్పుడు ప్రతేకంగా అన్ని విభాగాల్లో అన్ని సాధారణ మరియు గైనకాలజీ, హిస్టెరెక్టమీ పెల్విక్ లింఫ్ నోడ్ డిసెక్షన్లు, పైలోప్లాస్టీ మరియు ఆగ్మెంటేషన్ ప్రక్రియ వంటి యూరాలజీ విధానాలు, కిడ్నీ క్యాన్సర్లు పాక్షిక మరియు రాడికల్ నెఫ్రెక్టమీ, మల మరియు పెద్దప్రేగు క్యాన్సర్లు, ఇంటర్స్పింక్టెరిక్ రిసెక్షన్, శాశ్వత కోలోస్టోమీ మరియు ఊపిరితిత్తుల వంటి వాటిని తక్కువకోతతో ఎక్కడ ఓపెన్ సర్జరీస్ లో చేయలేనివాటిని ఈ అధునాతన రోబో ద్వారా నిర్వహించ వచ్చు అన్నారు. అన్ని విభాగాల్లో అధునాతన రోబోటిక్స్ కలిగి,వాటి కోసం ప్రత్యేక ఇన్స్టిట్యూట్ కలిగిన ఏకైక హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి కృష్ణ,డాక్టర్ కృష్ణ కిరణ్- డైరెక్టర్-చీఫ్ ప్రైమరీ & రివిజన్ హిప్ & మోకాలి మార్పిడి, మహేష్ దెగ్లూర్కర్-చీఫ్ బిజినెస్ ఆఫీసర్, డాక్టర్ రవిచందర్-సర్జికల్ అంకాలోజిస్ట్, డాక్టర్ లలిత యూరో గైనకాలజిస్ట్, సీనియర్ యూరోలాజిస్ట్స్ డాక్టర్ KVR ప్రసాద్, డాక్టర్ AV రవికుమార్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







