బంపర్ ఛాన్స్ కొట్టేసిన ‘బేబీ’.!
- September 06, 2023
ఇప్పుడున్న యంగ్ హీరోల్లో సిద్దు జొన్నలగడ్డ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ‘డీజె టిల్లు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి క్రేజ్ మీదున్నాడు. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’తో మరో హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నాడు.
అలాగే, బొమ్మరిల్లు భాస్కర్‌తో సిద్ధు జొన్నలగడ్డ ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ‘బేబీ’ సినిమాతో ఇటీవల హిట్టు కొట్టి, యూత్ హృదయాల్ని కొల్లగొట్టిన వైష్ణవీ చైతన్య పేరును సిద్దు జొన్నలగడ్డ రిఫర్ చేశాడట.
కథా నేపథ్యం ప్రకారం తెలంగాణాల యాసలో మాట్లాడే తెలుగమ్మాయ్ అయితే నేచురాలిటీకి దగ్గరగా వుంటుందనుకుంటున్నారట.
ఆ యాంగిల్‌లోనే వైష్ణవీ చైతన్య ఈ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అలాగే, దిల్ రాజు రూపొందించబోయే మరో సినిమా కోసం కూడా వైష్ణవీ చైతన్య పేరు పరిశీలిస్తున్నారట. దాదాపు కన్‌ఫామ్ అయిపోయినట్లే అని తెలుస్తోంది.
సో, వన్ మూవీ వండర్‌లా మిగిలిపోకుండా.. వైష్ణవీ చైతన్య బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులు బాగానే పట్టేసిందన్న మాట.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







