తైఫ్‌లో పబ్లిక్ బస్సు ట్రాన్స్ పొర్ట్ సేవలు ప్రారంభం

- September 07, 2023 , by Maagulf
తైఫ్‌లో పబ్లిక్ బస్సు ట్రాన్స్ పొర్ట్ సేవలు ప్రారంభం

జెడ్డా:  తైఫ్ గవర్నర్ ప్రిన్స్ సౌద్ బిన్ నహర్ తైఫ్ గవర్నరేట్‌లో పబ్లిక్ బస్సు రవాణా సేవల ప్రాజెక్టును ప్రారంభించారు. అల్-సుబైహిలో ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ యాక్టింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రుమైహ్ అల్-రుమైహ్, తైఫ్ మేయర్ నాసర్ అల్-రెహైలీ,  పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సీఈఓ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కీలకమైన బస్ ప్రాజెక్ట్ రాజ్యంలో పబ్లిక్ బస్సు రవాణా ప్రాజెక్టుల మొదటి దశలో కీలకమైనది. ఇది గవర్నరేట్‌లోని అత్యంత ముఖ్యమైన కేంద్రాలు,  ల్యాండ్‌మార్క్‌లను అనుసంధానించే తొమ్మిది ప్రధాన ట్రాక్‌ల ద్వారా సంవత్సరానికి రెండు మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు సేవలు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. 182 బస్ స్టాప్ పాయింట్లు ఉంటాయని, ఈ ప్రాజెక్ట్‌లో 58 బస్సులు రోజుకు 18 గంటలు సేవలు అందిస్తాయని పేర్కొన్నారు. ఇది గవర్నరేట్‌లోని ట్రాఫిక్ భద్రత స్థాయిని మెరుగుపరచడం, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడం,  కార్బన్ ఉద్గారాలను మరియు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదం చేయనుందన్నారు. Taif Buses అప్లికేషన్ ద్వారా ప్రయాణికులు సేవలను ముందుగానే బుక్ చేసుకోవచ్చని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com