చెత్తబుట్టలో రూ.56 లక్షల విలువైన బంగారం..
- September 08, 2023
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో బంగారం పట్టుబడుతోంది. ఇతర దేశాలనుండి పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకొచ్చి..ఇక్కడ అధికారులకు చిక్కుతున్నారు. అయితే అధికారుల నుండి తప్పించుకెందుకు చాల తెలివిగా బంగారాన్ని దాచిపెడుతున్నారు..కానీ అధికారుల మూడో కన్ను నుండి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి..ఎయిర్ పోర్ట్ సిబ్బంది తో కలిసి రూ. 56 లక్షల విలువైన బంగారాన్ని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికాడు.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి బుధవారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చాడు. తన వెంట రహస్యంగా రూ.56.63 లక్షల విలువైన 933 గ్రాముల బంగారం బిస్కెట్లను తీసుకొని ఎయిర్పోర్టుకు వచ్చాడు. అయితే అతడు కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడే ఉన్న ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్ తనిఖీలకు వచ్చాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా.. అతడి తీరు అనుమానస్పదంగా కనిపించటంతో అధికారులు అతడిని విచారించారు.
దీంతో అసలు విషయం చెప్పేశాడు. తాను దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి చెత్తడబ్బాలో వేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని ఎయిర్పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







