ప్రధాని అధికారిక నివాసంలో మోడీ, బైడెన్ ల సమావేశం
- September 08, 2023
న్యూఢిల్లీ: ఢిల్లీలో జీ20 సమావేశాల హడావుడి ప్రారంభమయింది. ఇప్పటికే పలు దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హస్తినలో అడుగుపెడతారు. అనంతరం ప్రధాని మోడీతో బైడెన్ ప్రత్యేకంగా సమావేశమవుతారు. వీరి సమావేశం ప్రధాని మోడీ అధికారిక నివాసంలో జరగనుంది. సమావేశానంతరం బైడెన్ కు మోడీ ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నారు.
మరోవైపు, వీరి సమావేశానికి సంబంధించిన అజెండాలో పలు కీలక అంశాలు ఉన్నాయి. న్యూక్లియర్ టెక్నాలజీ, జీఈ జెట్ ఇంజిన్లు, ప్రిడేటర్ డ్రోన్లు, 5జీ/6జీ స్పెక్ట్రమ్ తదితర కీలక అంశాలపై వీరు చర్చించనున్నారు. ఇంకోవైపు, విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత బైడెన్ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







