అనుష్క సెట్ అయిపోయిందిగా.!
- September 09, 2023
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అభిమానుల మనసుల్లో స్వీటీగా ముద్ర వేయించుకున్న అనుష్క శెట్టి, ఇటీవలే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.
గత మూడేళ్లకు పైగా అనుష్క సినిమాలకు దూరమైంది. భారీగా బరువు పెరగడం, ఇతరత్రా అనారోగ్య కారణాలతో అనుష్క సినిమాలకు దూరంగా వుంటూ వస్తోంది.
అయితే, తాజాగా నవీన్ పోలిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అనుష్కకి మంచి కమ్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో పాటూ, అనుష్క ఓ మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది. ‘కాథాకార్’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న మలయాళ చిత్రంలో అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో అనుష్క నెగిటివ్ రోల్ పోషిస్తోందనీ అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.
ఇంతవరకూ హీరోయిన్‌గా, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ స్టార్‌డమ్ సంపాదించుకున్న అనుష్క నెగిటివ్ రోల్‌లో ఎలా వుండబోతోందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!