డేట్ మార్చుకున్న ‘చంద్రముఖి 2’
- September 09, 2023
17 ఏళ్ల క్రితం వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తోంది.
కొరియోగ్రఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడు, నిర్మాత అయిన రాఘవ లారెన్స్ మేల్ లీడ్ పోషిస్తున్నాడీ సినిమాలో. అయితే, ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది.
కానీ, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడిందని మేకర్లు ప్రకటించారు. ఇదే నెల 28న ‘చంద్రముఖి 2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా వుంటే, రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో హై క్వాలిటీ సీజీ ఎఫెక్టులతో ఈ సినిమా రూపొందబోతోందనీ ట్రైలర్ ద్వారా ఆల్రెడీ ప్రూవ్ చేసింది చిత్ర యూనిట్.
‘రోబో’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో సంచలనాలు క్రియేట్ చేసిన ‘చంద్రముఖి’ సినిమా లెగసీని ఈ సీక్వెల్ బీట్ చేస్తుందా.? లేక కంటిన్యూ చేస్తుందా.?చూడాలి మరి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







