‘బేబీ’ తర్వాత వేగం పెంచిన ఆనంద్ దేవరకొండ.!
- September 09, 2023
‘బేబీ’ సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టి సెటిల్డ్ పర్ఫామ్డ్ హీరో అనిపించుకున్న కుర్రాడు ఆనంద్ దేవరకొండ. ఇంతవరకూ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆ ట్యాగ్‌తోనే చెలామణీ అయ్యాడు. ఇప్పుడు కుర్రాడి టాలెంట్ బయట పడింది ‘బేబీ’ సినిమాతో.
దాంతో, ఆనంద్ దేవరకొండ సెపరేట్‌గా తన ప్లాట్ ఫామ్ సిద్ధం చేసుకుంటున్నాడనిపిస్తోంది. ‘బేబీ’ తర్వాత వరుసగా కథలను సెట్ చేసి పెట్టాడట. ‘బేబీ’ టైమ్‌లోనే ‘గం గం గణేశా’ సినిమా పూర్తి చేసేశాడు ఆనంద్ దేవరకొండ.
ఇదో కాన్సెప్ట్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమాని నవంబర్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్ని అనౌన్స్ చేసేందుకు సిద్ధంగా వున్నాడట ఆనంద్ దేవరకొండ.
అనౌన్స్ చేయడంతో పాటూ, త్వరలోనే ఆ సినిమాల్ని పట్టాలెక్కించేసి, ‘బేబీ’తో వచ్చిన క్రేజ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడట. చూడాలి మరి.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







