పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే.. 10,000 దిర్హామ్ జరిమానా, ఏడాది జైలు
- September 11, 2023
యూఏఈ: యూఏఈలో ఉద్యోగులకు సురక్షితమైన, తగిన పని వాతావరణాన్ని అందించడం కంపెనీ/సంస్థ యజమాని బాధ్యత. ఇది ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 13(13)కి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ/సంస్థలో ఒక వ్యక్తిని మాటలతో, శారీరకంగా మరియు లైంగికంగా వేధించడం చట్టవిరుద్ధం. ఇది ఉపాధి చట్టంలోని ఆర్టికల్ 14(2) మరియు యూఏఈ శిక్షా చట్టంలోని ఆర్టికల్ 413కి అనుగుణంగా ఉంటుంది. యూఏఈ శిక్షా చట్టంలోని ఆర్టికల్ 413 ప్రకారం.. లైంగిక వేధింపుల నేరానికి పాల్పడిన వ్యక్తికి కనీసం ఒక (1) సంవత్సరం జైలు శిక్ష, 10,000 దిర్హామ్ల కంటే తక్కువ కాకుండా విధించే అవకాశం ఉంది. యూఏఈ శిక్షా చట్టంలోని నిబంధనల ప్రకారం.. యూఏఈలో నేరపూరితమైన ప్రవర్తన, దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వ్యక్తిగతంగా కంపెనీ/సంస్థకు బాధితులు తెలియజేయవచ్చు. యూఏఈ శిక్షా చట్టంలోని ఆర్టికల్ 411, ఆర్టికల్ 412(1) మరియు పైన పేర్కొన్న ఆర్టికల్ 413 ప్రకారం.. బాధితులపై అనుచితంగా ప్రవర్తించడం కొనసాగిస్తే పోలీసులకు క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేయవచ్చని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా వెల్లడించారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







