సోమాలియాలో యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా జరిగిన దాడిలో 6గురి మృతి

- June 25, 2015 , by Maagulf
సోమాలియాలో యు.ఏ.ఈ  సహాయక దళాలు లక్ష్యంగా జరిగిన దాడిలో 6గురి మృతి

సోమాలియా రాజధాని మొగదిషూలో  ఈ బుధవారం యు.ఏ.ఈ సహాయక దళాలు లక్ష్యంగా అల్ షాబాబ్ తీవ్రవాద సంస్థ ఆత్మాహుతిదళ సభ్యుడు తన కారుతో, సహాయకదళ పికప్ ట్రక్కును ఢీకొన్న దుర్ఘటనలో జరిగిన పేలుడులో కనీసం ఆరుగురు వ్యక్తులు మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. కాగా, సోమాలియా పోలీసు అధికారి అబ్డుకాదీర్ హస్సన్, యు.ఎ. ఇ. అధికారులెవరు ఈ దాడిలో గాయపడలేదని స్పష్టం చేశారు.
సోమాలియాలో యు.ఎ.ఇ. దళాలు రక్షణ, మౌలికవసతి, అభివృద్ధి ప్రోజక్టులు ఇంకా అనేక సహాయక చర్యలు నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ ఘటనపై యు.ఎ. ఇ.  విదేశీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి డా. అన్వర్ మొహమ్మద్ గార్గాష్ ఈ తీవ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com