చరిత్ర సృష్టించిన రోహిత్-గిల్ జోడీ..
- September 12, 2023
కొలంబో: భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత జోడిగా రికార్డులకు ఎక్కారు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో ఈ ఘనతను అందుకున్నారు.
ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లు వచ్చారు. వీరిద్దరు కలిసి 36 పరుగులు చేయడంతో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. ఈ ఘనతను ఈ జోడీ కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకుంది. కాగా.. గతంలో ఈ రికార్డు రోహిత్-రాహుల్ పేరిట ఉండేది. రోహిత్-రాహుల్ జోడి 14 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో వరుసగా రెండు సార్లు 100 ఫ్లస్ భాగస్వామ్యాలను రోహిత్-గిల్ జోడి అందించింది. గ్రూప్ దశలో నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో 147, సూపర్-4 దశలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 121 పరుగులు మొదటి వికెట్ కు జోడించి భారత్ కు అద్భుత ఆరంభాలను అందించారు. అంతేకాదు.. ఈ జోడీ అత్యధిక సగటు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని కూడా కలిగి ఉంది.
టీమ్ ఇండియా తరుపున అత్యంత వేగంగా 1000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీలు..
- రోహిత్ శర్మ- శుభ్‌మన్ గిల్ (13 ఇన్నింగ్స్‌ల్లో)
- రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ (14ఇన్నింగ్స్‌ల్లో)
- ఎంఎస్ ధోనీ-గౌతమ్ గంభీర్ (14ఇన్నింగ్స్‌ల్లో)
- రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ(16ఇన్నింగ్స్‌ల్లో)
- ఎంఎస్ ధోనీ – సురేశ్ రైనా (16ఇన్నింగ్స్‌ల్లో)
- శిఖర్ ధావన్-అజింక్యా రహానే (16ఇన్నింగ్స్‌ల్లో)
- సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజా(16ఇన్నింగ్స్‌ల్లో)
- మహ్మద్ అజారుద్దీన్-సునీల్ గవాస్కర్(16ఇన్నింగ్స్‌ల్లో)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







