మస్కట్‌లో ఒమానీ సుల్తాన్‌ను కలిసిన క్రౌన్ ప్రిన్స్
- September 14, 2023
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ ను సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ సమావేశమయ్యారు. మస్కట్‌లోని అల్-బరాకా ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒమన్ , సౌదీ అరేబియా మధ్య శాశ్వతమైన సోదర సంబంధాలను బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. అదే విధంగా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై సమీక్షించారు. సౌదీ యువరాజు మహ్మద్‌తో పాటు నేషనల్ గార్డ్ మంత్రి ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్, రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్, సాంస్కృతిక మంత్రి ప్రిన్స్ బదర్ బిన్ అబ్దుల్లా బిన్ ఫర్హాన్ సహా ప్రముఖ అధికారులు ఉన్నారు. ఈ సమావేశంలో ఒమన్‌కు రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి సయ్యద్ షిహాబ్ బిన్ తారిఖ్, సాంస్కృతిక, క్రీడలు మరియు యువజన మంత్రి సయ్యద్ ధి యజాన్ బిన్ హైతం, సయ్యద్ బిలారబ్ బిన్ హైతం అల్ సయీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







