తెలుగు విద్యార్థి మృతి పై అమెరికా పోలీసు అపహాస్యం..
- September 14, 2023
న్యూఢిల్లీ: అమెరికాలో ఆంధ్రా యువతి మరణాన్ని పోలీసులు అవహేళన చేసిన ఘటన పై లోతైన దర్యాప్తు చేయాలని భారత్ తాజాగా అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. యువతి మరణాన్ని చులకన చేస్తూ పోలీసులు చేసిన వ్యాఖ్యల తాలూకు ఆడియో రికార్డింగ్ వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అమెరికాలోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ సియాటెల్ క్యాంపస్‌లో మాస్టర్స్ చేస్తున్న కందుల జాహ్నవి(23) ఈ ఏడాది జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. రోడ్డు దాటుతున్న ఆమెను పోలీసు కారు వేగంగా ఢీకొనడంతో ఆమె దుర్మరణం చెందారు. ఘటన సమయంలో కారును కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి నడుపుతున్నారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కేసులో ఘటనాస్థలానికి వేగంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారు జాహ్నవిని ఢీకొట్టినట్టు తేలింది.
కాగా, ఈ ఘటనపై పోలీసు యూనియన్.. బాధిత కుటుంబానికి 11 వేల డాలర్ల పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై మరో ఇద్దరు పోలీసుల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ అధికారి జాహ్నవి మరణాన్ని అవహేళన చేశారు. ‘‘ఆమెకు 26 ఏళ్లే.. ఓ సాధారణ వ్యక్తి. ఆమె ప్రాణానికి అంత విలువేమీ లేదు. పరిహారం ఇవ్వండి’’ అంటూ సియాటెల్ పోలీసుల సంఘం వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరర్ చేసిన చులకన వ్యాఖ్యలు అతడి యూనిఫాంకు అమర్చిన మైక్‌లో రికార్డయ్యాయి. డిపార్ట్‌మెంట్‌లో జరిగిన సాధారణ తనిఖీల్లో ఈ ఆడియో బయటపడటంతో వివాదానికి దారి తీసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







