మరోసారి కెసిఆర్ అధికారంలోకి వస్తే నిజాం పాలన తెస్తారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- September 14, 2023
హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్తు పై మేధావులు ఒక్కసారి ఆలోచించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దుర్మార్గాలను మరిచిపోవద్దని చెప్పారు. కెసిఆర్ మరోసారి అధికారంలోకి వస్తే నిజాం పాలన తెస్తారని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ సమాజమా మేలుకో.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బిఆర్ఎస్ను సమర్థించినట్లే.. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో వెళ్తామని బిఆర్ఎస్ నేతలు చెప్పారన్న విషయాన్ని గుర్తు పెట్టుకో’ అని కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యలపై.. కెసిఆర్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షను కిషన్ రెడ్డి విరమించారు. జాతీయ నేత ప్రకాశ్ జావడేకర్.. కిషన్ రెడ్డికి నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కెసిఆర్ గురువు అసదుద్దీన్ ఒవైసీ అని అన్నారు. కెసిఆర్ఆర్కు ఓటేస్తే ఎమ్ఐఎమ్ కోసం పనిచేస్తారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రం కోసం పోరాడిన సంఘాలన్నింటిని కెసిఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్పీఎస్సీలోనే ఖాళీలు ఉన్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిజెపి ని గెలిపిస్తే తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.
తాజా వార్తలు
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్







