మరోసారి ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు
- September 14, 2023
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులలో ఈడి పేర్కొంది. ఈ కేసులో కీలకంగా ఉన్న హైదరాబాద్ కి చెందిన బిజినెస్మెన్ అరుణ్ రామచంద్ర పిళ్ళై బుధవారం అప్రూవర్ గా మారారు. ఈ మేరకు సిఆర్పిసి సెక్షన్ 164 కింద ప్రత్యేక న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఆయన నుంచి ఈడి అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. అరుణ్ రామచంద్ర ఎమ్మెల్సీ కవిత బినామీగా ఈడి అభియోగం మోపింది.
ఈ నేపథ్యంలోనే గురువారం ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఈడి జారీ చేసింది. నిజానికి అరుణ్ అప్రూవర్ గా మారడం ఇది కొత్త కాదు. గతంలో ఓసారి కూడా ఇలాగే అప్రూవల్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చి.. ఆ తర్వాత బలవంతంగా అప్రూవర్ గా మారేలా చేశారంటూ మాట మార్చారు. ఇప్పుడు మరోసారి అరుణ్ రామచంద్ర అప్రూవర్ గా మారారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







