ఎటిసలాట్ వినియోగదారులకు ఉచిత కాల్‌ల ఆఫర్..!!
- September 14, 2023
యూఏఈ: యూఏఈ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎటిసలాట్ తన వినియోగదారులకు ఉచిత కాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడానికి లిబియాకు ఉచిత కాల్‌లను ప్రకటించింది ఎటిసలాట్. భారీ వరదల నేపథ్యంలో ఉత్తర ఆఫ్రికా దేశంలో 5,000 మందికి పైగా చనిపోయారని, 10,000 మందికి పైగా తప్పిపోయారని లిబియా అధికారులు వెల్లడించారు. ఉచిత కాల్‌లు వరదల వల్ల ప్రభావితమైన కస్టమర్‌లు, సహోద్యోగులు, వారి ప్రియమైన వారి యోగక్షేమాలు తెలుసుకునేందుకు సంఘీభావాన్ని తెలియజేస్తూ అందించబడుతున్నాయని అని పేర్కొంది. ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ (ERC) కూడా లిబియాలో వరదల వల్ల నష్టపోయిన వారికి అత్యవసర మానవతా సహాయం అందిస్తోంది. తమ కస్టమర్‌లు సెప్టెంబర్ 20 బుధవారం వరకు ఒక వారం పాటు కాల్ చేయడానికి 30 ఉచిత అంతర్జాతీయ నిమిషాలను స్వీకరిస్తారని తెలిపింది. లిబియాలో రోమింగ్ నెట్‌వర్క్‌లో ఉన్న కస్టమర్‌లు అపరిమిత అవుట్‌గోయింగ్ నిమిషాలు, 30 ఇన్‌కమింగ్ నిమిషాల నుండి ప్రయోజనం పొందుతారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ







