క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహించిన రాయల్ హాస్పిటల్
- September 20, 2023
మస్కట్: రాయల్ హాస్పిటల్ సర్జరీ విభాగానికి చెందిన ప్రత్యేక వైద్య బృందం ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించింది. దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి అడ్రినల్ గ్రంధులలో కణితి, పెద్దప్రేగులో తీవ్రమైన వాపు కారణంగా తీవ్రమైన అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోగి యొక్క అడ్రినల్ గ్రంథులు, పెద్దప్రేగును తొలగించి పేషెంట్ ను కాపాడారు. రాయల్ హాస్పిటల్‌లోని జనరల్ సర్జరీ విభాగాధిపతి, కన్సల్టెంట్ ఎండోక్రైన్ సర్జన్ డాక్టర్ అమర్ రెధా బృందానికి నాయకత్వం వహించారు. ఇటువంటి ఆపరేషన్‌లు చాలా అరుదుగా మరియు సంక్లిష్టమైనవిగా పరిగణించబడతాయని పేర్కొన్నారు. డ్యూయల్ సర్జరీ ఏకకాలంలో నిర్వహించామని తెలిపారు. రోగి శరీరం కుడి భాగంలో తొలగించబడిన గ్రంధి 100 గ్రాముల బరువును కలిగి ఉందని, ఎడమ వైపున 3 కిలోల బరువు ఉందని డాక్టర్ అమ్ర్ తెలిపారు. ఇది సాధారణ పరిమాణం 40 గ్రాముల కంటే చాలా ఎక్కువ అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







