సౌదీలో 25వ ప్రపంచ పెట్రోలియం సదస్సు
- September 20, 2023
కెనడా: 2026లో 25వ ప్రపంచ పెట్రోలియం సదస్సును సౌదీ అరేబియా నిర్వహించనుంది. ఈ మేరకు ప్రపంచ పెట్రోలియం కౌన్సిల్ ప్రెసిడెంట్ పెడ్రో మిరాస్తో సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రపంచ పెట్రోలియం కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ కమిటీ.. సౌదీ అరేబియాలో 25వ ఎడిషన్ కాన్ఫరెన్స్, 2026లో రియాద్‌లో ఎగ్జిబిషన్‌ను నిర్వహించేందుకు వేసిన బిడ్‌ను అంగీకరించింది. గత అక్టోబర్‌లో కజకిస్థాన్‌లోని అల్మాటీలో వరల్డ్ పెట్రోలియం కౌన్సిల్ నిర్వహించిన యూత్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచ పెట్రోలియం కాన్ఫరెన్స్, దానితో పాటు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రదర్శన వివిధ ఇంధన రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి.. పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ సంస్థలను ఒకచోట చేర్చే ప్రముఖ ప్రపంచ ఈవెంట్ గా గుర్తింపు ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







