ప్రపంచవ్యాప్తంగా విద్యకు $2.3 బిలియన్ల సహాయం

- September 20, 2023 , by Maagulf
ప్రపంచవ్యాప్తంగా విద్యకు $2.3 బిలియన్ల సహాయం

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా విద్యరంగానికి మద్దతు ఇవ్వడం అనేది ఖతార్ అభివృద్ధి ఎజెండాలో భాగంగా ఉందని  ఖతార్ విద్య, ఉన్నత విద్యా శాఖ మంత్రి హెచ్ ఈ బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమి తెలిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యకు మద్దతు ఇవ్వడానికి 2.3 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించినట్లు పేర్కొన్నారు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు నాణ్యమైన విద్యా అవకాశాలను పొందుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. యువత తమ కమ్యూనిటీల అభివృద్ధికి మరియు శ్రేయస్సుకు దోహదపడేందుకు ఇది వీలు కల్పిస్తుందని ఆమె అన్నారు. న్యూయార్క్‌లో జరుగుతున్న 78వ UNGA సమావేశాల సందర్భంగా 'లెర్నింగ్ టూ బిల్డ్ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్’ అనే థీమ్‌తో నిర్వహంచిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఐక్యరాజ్యసమితిలో ఖతార్ రాష్ట్ర శాశ్వత ప్రతినిధి షేఖా అల్యా అహ్మద్ బిన్ సైఫ్ అల్ థానీ ఈ సమావేశానికి హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com