తెలంగాణ మహిళా ఏఎస్పీ ఎవరెస్ట్ రికార్డు
- May 20, 2016
ఆదిలాబాద్ అదనపు ఏఎస్పీగా పనిచేస్తున్న రాధిక ఎవరెస్టు శిఖరం అధిరోహించి రికార్డు సృష్టించారు. దక్షిణ భారత దేశం నుంచి ఎవరెస్టు అధిరోహించిన మొదటి పోలీస్ అధికారిణిగా ఈమె రికార్డు నెలకొల్పారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రాధిక ఏడాది నుంచి ఆదిలాబాద్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు.ఏప్రిల్ 5న రాష్ట్రం నుంచి బయలుదేరిన ఈమె శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఆరుగురు సభ్యుల బృందంలో ఈమె ఒక్కరే మహిళ. రాధిక ఇంతకుముందు 7,077 మీటర్ల ఎత్తై కూన్ పర్వతాన్ని కూడా అధిరోహించి.. ఈ పర్వతశిఖరాన్ని తాకిన ప్రపంచంలో రెండో మహిళగా రికార్డు నెలకొల్పారు. ఏపీపీఎస్సీ ద్వారా 2001లో లెక్చరర్ పోస్టు సాధించిన రాధిక 2007లో డీఎస్పీగా ఎంపికయ్యారు. మొదట గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







