జ్యుయెలరీ దొంగల ముఠా పట్టివేత
- May 20, 2016
ఏడుగురు సభ్యులు గల దొంగల ముఠాపై పోలీసు అధికారులు కేసులు నమోదు చేసి, ట్రయల్కి తరలించారు. ఈ ముఠాలో ఐదుగురు కొలంబియన్స్, ఇద్దరు సుడానీస్ ఉన్నారు. విల్లాలను దొంగతనం చేయడంలో వీరు దిట్ట. విల్లాల్లో ఎవరూ లేని సమయం చూసి, ఈ ముఠా దొంగతనాలకు పాల్పడుతుంది. జుమైరాలోని ఓ పాకిస్తానీ మహిళకు చెందిన విల్లాపై కన్నేసిన దుండగులు, ఆ విల్లాపై దాడి చేశారు. విలువైన వస్తువుల్ని, నగదుని దొంగలించారు. కేసు విచారించిన పోలీసులు దొంగల ముఠాని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు దొంగల్ని గుర్తించారు. దొంగలంతా నిరుద్యోగులుగా పోలీసులు తేల్చారు. అజ్మన్‌లోని ఓ స్టోర్‌లో దొంగతనానికి అవసరమైన వస్తువుల్ని దుండుగులు కొనుగోలు చేశారని పోలీసు అధికారి వివరించారు. దొంగిలించిన వస్తువుల విలువ 1,055,000 దిర్హామ్‌లు అని పోలీసులు వివరించారు. ఈ కేసులో తీర్పు జూన్ 13న వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







