బస్సు యాత్రకు సిద్ధమైన టీ కాంగ్రెస్
- September 21, 2023
హైదరాబాద్: టీ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రకు సిద్ధమైంది. మరో నాల్గు , ఐదు నెలల్లో తెలంగాణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంది. ఎలాగైనా రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తుంది. రీసెంట్ గా ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించి ప్రజల్లో ఆసక్తి రేపిన కాంగ్రెస్..ఇప్పుడు బస్సు యాత్ర తో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతుంది. వచ్చే నెల మొదటి వారం నుంచే యాత్రను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఎన్నికల ముందు జరుగుతున్న బస్సుయాత్రలో…పార్టీ కీలక నేతలంతా పాల్గొననున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సుయాత్రలో ఆరు గ్యారంటీ పథకాలను… ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు నేతలు. అదే సమయంలో బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించింది కాంగ్రెస్ పార్టీ. అక్టోబర్ మొదటి వారంలోనే యాత్ర మొదలు పెట్టి 10–12 రోజుల్లోనే…వీలయినన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో సాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. బస్సుయాత్ర రూట్‌మ్యాప్, షెడ్యూల్‌ను…రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







