అణు బాంబులు తయారు చేస్తామంటూ బాంబ్ పేల్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్
- September 21, 2023
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ సంచలన ప్రకటన చేశారు. తాము కూడా అణు బాంబ్ తయారు చేస్తామంటూ బెదిరింపులు చేశారు. బుధవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రత్యర్థి ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే, తాను కూడా అణు బాంబును తయారు చేస్తానని అన్నారు. ఇరాన్ వద్ద అణుబాంబు ఉంటే తమ దగ్గర కూడా అణుబాంబు ఉండాల్సిందేనని మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ ‘‘ఒక దేశం అణ్వాయుధాలను కొనుగోలు చేసినప్పుడల్లా, ఇతర దేశాలు ఆందోళన చెందుతాయి. అయితే ఏ దేశమూ అణ్వాయుధాలను ఉపయోగించకూడదు. ఒక దేశం అణ్వాయుధాలను ఉపయోగిస్తే, అది మొత్తం ప్రపంచంపై యుద్ధం చేయడంతో సమానం’’ అని అన్నారు.
ప్రపంచం మరో హిరోషిమాను చూడలేదని ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. ‘‘2015 నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచ్ఛిన్నం చేశారు. దీని తరువాత, 2020 సంవత్సరంలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, జో బిడెన్ కూడా ఇరాన్ అణు ఒప్పందంపై దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ప్రారంభించింది’’ అని మహ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. దీని కారణంగా చుట్టుపక్కల దేశాల స్థిరత్వానికి ముప్పు ఏర్పడిందని ఆయన అన్నారు. బహుశా ఈ కారణంగానే ఏమో 2016లో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా, 80 బిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రాబోయే రెండు దశాబ్దాల్లో 16 అణు రియాక్టర్లను నిర్మించాలని తన ప్రణాళికను ప్రకటించింది.
ఇక ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం గురించి క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ.. సంబంధాలను సాధారణీకరించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. పాలస్తీనా సమస్య మనకు చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. దాన్ని పరిష్కరించాలని, అయితే చర్చలు ఎక్కడికి వెళ్తాయో చూడాలని అన్నారు. ఇది పాలస్తీనియన్ల జీవితాలను సులభతరం చేసే స్థాయికి చేరుకుంటుందని తాము ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుల సమావేశం తర్వాత క్రౌన్ ప్రిన్స్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్‌ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్‌లు
- బీచ్‌లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి